ఇప్పుడు రుణం తీసుకోవ‌డం చాలా సులువ‌య్యింది. చిటికెలో రుణం అందించేందుకు చాలా మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి డాంక్యుమెంట్లు, పేప‌ర్లు, హామీ ప‌త్రాలు లేకుండా, క‌నీసం సంతకం అయినా తీసుకోకుండా లోన్‌ను మ‌న అకౌంట్లో జ‌మ చేసే సంస్థ‌లు ఎన్నో ఇప్పుడు ఉన్నాయి. ఇలా రుణం ఇచ్చే సంస్థ‌లు ప‌దుల సంఖ్య‌లో ఉన్న‌ప్ప‌టికీ వాటిలో మంచివేవో, మోస‌పూరిత‌మైన‌వి ఏవో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇటువంటి మ‌నీ లోన్ యాప్స్‌ను ఆశ్ర‌యించే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

what is need of mobile loaning apps

రుణం కావాల‌ని బ్యాంకుకు వెళ్తే అక్క‌డ వంద నిబంధ‌న‌లు పెట్టి మ‌న‌ల్ని వేధిస్తారు. మ‌న అవ‌స‌రాన్ని వాళ్లు అవ‌కాశంగా వాడుకుంటారు. హామీ ప‌త్రాలు, ఆస్తి కాగితాల‌ను అడుగుతారు. ఇక్క‌డా అక్క‌డా అంటూ చాలా సంత‌కాలు చేయించుకుంటారు. తీరా అన్నీ చేసాక మీకు అంత రుణం రాదు, కొంచ‌మే ఇస్తామంటూ కొర్రీలు పెడ‌తారు. ఇవ‌న్నీ భ‌రించ‌లేకే చాలా మంది బ్యాంకుకు వెళ్లేందుకే భ‌య‌ప‌డుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీరుస్తున్నాయి.

key factors to know mobile loan apps

లోన్‌ తీసుకునేముందు మొబైల్ లోన్‌ యాప్ పేరున్న‌దో లేదో, ఆ సంస్థ యాజ‌మాన్యం ఎవ‌రిదో ప‌రిశీలించాలి.
* రుణంపై వ‌సూలు చేసే వ‌డ్డీ ఎంతో తెలుసుకోవాలి. ఇంకా ఇత‌ర చార్జీలు ఏమైనా ఉన్నాయో లేదో ప‌రిశీలించాలి. లేట్ పేమెంట్ ఫైన్ గురించి త‌ప్ప‌కుండా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల్సిందే.
* మొబైల్ లోన్ యాప్ ప‌నితీరు, రివ్యూస్‌ను ఆన్‌లైన్‌లో చ‌దివి నిర్ణ‌యం తీసుకోవాలి.
* యాప్‌లో అడిగే వివ‌రాలను, మ‌న ద‌గ్గ‌ర తీసుకునే అనుమ‌తుల‌ను ఒక సారి అధ్య‌య‌నం చేయాలి. * మ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఇచ్చేట‌ప్పుడు వాటిని స‌క్ర‌మంగా వినియోగిస్తున్నారో, లేదా దుర్వినియోగం చేస్తున్నారో అన్న‌ది ఓ లుక్కేయాలి.
* యాప్ ఇంట‌ర్‌ఫేస్ ఎలా ఉందో, వివ‌రాలను స‌రిగ్గా చూపిస్తుందో లేదో ప‌రిశీలించాలి.
ఆ కంపెనీ ఆర్‌బీఐతో రిజిస్ట‌ర్ అయ్యిందో లేదో, ఆ సంస్థ‌కు అన్ని అనుమ‌తులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

  • అన్నింటి క‌న్నా ముందు మ‌న‌కు లోన్ ఎంత అవ‌స‌ర‌మో, అస‌లు అవ‌స‌ర‌మో లేదో బాగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.

famous mobile loaning apps in india

నేవీ లోన్స్‌
పే సెన్స్‌
పెటియం క్యాష్ ఈ
మనీ టాప్‌
ధ‌నీ
హోం క్రెడిట్‌
నీరా
ఇండియా లెండ్స్‌
మనీ వ్యూ
ఎం పోకెట్‌
పే మీ ఇండియా

వంద‌ల కొద్దీ ఉన్న మొబైల్ లోన్ యాప్స్‌లో పేరెన్నిక గ‌ల‌వి ఇవి. ఇలాంటివి మ‌రెన్నో మంచి సంస్థ‌లు ఉన్నా వాటి గురించి కూడా తెలుసుకునే వాటిని వాడుకోవాలి. రుణం పొందే ముందే మ‌నం వాటి నిబంధ‌న‌లను ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే చ‌ట్ట‌ప‌రంగా మ‌నం శిక్షార్హుల‌మ‌వుతాం. మ‌నం చెల్లించాల్స‌ని రుణ వాయిదాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లించాలి. వ‌స్తుంది క‌దా అని మనం ఎంతైతే అంత తీసుకోకుండా అవ‌స‌ర‌మెంతో అంతే మొత్తం మ‌నం రుణం తీసుకోవాలి.

be alert with mobile loans

మొబైల్ అప్ లో యాప్ లో  ఋణం తీసుకున్నాక  మనం  చెల్లించలేకపోతే  చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది. సదరు  సంస్థ సిబ్బంది  మనల్ని మానసికంగా  చాలా  ఇబ్బందులకు గురి చేస్తుంటారు. మన పర్సనల్ లైఫ్ ని  చేస్తారు. మన ఫ్రెండ్స్ కి, ఫామిలీకి మన గురించి చాలా తప్పుడు సమాచారం  ఇవ్వడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అసభ్యకరంగా సోషల్ మీడియా లో మెసేజ్లు   వేధిస్తారు. ఇలాంటి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. అందుకే ఇలా లోన్  చాలా జాగ్రత్తగా  ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *