no special facilities to chitra ramakrishnan in jail

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ( ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన డిల్లీ కోర్టు జైలులో ఆమెకు ప్రత్యేక సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఒప్పుకోలేదు. జైలులో కొన్ని సదుపాయాలు కావాలని కోరుతూ ఆమె చేసుకున్న విజ్ఞప్తిని తిరస్కరించింది. చిత్రను వేరుగా చూడలేమని, అందరి ఖైదీల‌లానే ఆమెనూ చూడాల‌న్నారు. ` ఈ నెల 28న భౌతికంగా మళ్ళీ కోర్టు ముందు హాజరు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి జస్టీస్ సంజీవ్ అగర్వాల్ ఆమెను ఆదేశించారు. ఇంటి నుంచి తెచ్చే భోజనానికి జైలులో అనుమతివ్వాల`ని కోరిన న్యాయవాది విజ్ఞప్తిని తిరస్కరించారు.` జైలు ఆహారాన్ని మేం స్వీకరించాం. అది బాగుంటుంద`ని న్యాయమూర్తి అన్నారు.

`వీఐపీ ఖైదీలు అన్నీ కావాలంటారు. ప్రతి ఖైదీ సమానమే. ఆమె గతంలో ఏ హోదాలో పనిచేశారన్నదాన్ని బట్టి ఆమెకు సౌకర్యాలు కల్పించలేమ` ని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే కళ్ళజోడు, ప్రార్థనా పుస్తకం, ఔషదాలకు మాత్రం కోర్టు అంగీకారం తెలిపింది. 7 రోజుల కస్టడీ పూర్తి కావడంతో … జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ కేంద్రం దర్యాప్తు సంస్థ(సీబీఐ) చిత్రను కోర్టు ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో తాజాఆదేశాలు చోటు చేసుకున్నాయి.

who plays key role  in nse co location scam

కో లొకేషన్ కేసులో అన్నింటినీ వెనక ఉండి నడిపింది ఆమేనా..? లేదంటే వేరెవ‌రైనా ఈమెను నడిపించారా అనేది తేలిందా అని కోర్టు ప్రశ్నించింది. ఇప్పుడే దీనిపై చెప్పలేమ ని సీబీఐ న్యాయవాది తెలిపారు. ఇదే కేసులో అరెస్టయిన ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ( జోఓఓ) ఆనంద్ సుబ్రమణియన్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 24న కోర్టు నిర్ణయం తెలపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *