
పోస్టాఫీసు లో Group Accident Guard Policyతో ఎన్నో లాభాలు
రోడ్డెక్కనిదే మనకు కుటుంబం గడవదు. రోడ్ల మీద చూస్తే వాహనాల రద్దీ ఏటికేడు పెరుగుతూనే ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదుటి వ్యక్తి అజాగ్రత్త వల్లో, మరో కారణం చేతో రోడ్డు ప్రమాదం జరిగితే అంతే! ఇది ఊహించడానికే భయంకరమైన విషయం. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి ప్రాణాల్నే కాదు, మొత్తం కుటుంబాన్నే నడిరోడ్డు మీద నిలబెడుతుంది. సంపాదించే వ్యక్తి ఒకవేళ రోడ్డు ప్రమాదం బారిన పడితే, ఆ కుటుంబం మొత్తం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. అందుకే ప్రమాద బీమా చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. అయితే ఏ ప్రమాద బీమా మనకు పూర్తి స్థాయి ప్రయోజనాలు ఇస్తుందో, ఏది తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం ఇస్తుందో ముందు మనం తెలుసుకోవాలి.
ప్రమాద బీమాపై ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా తరహాలో ప్రమాద బీమా కూడా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో తపాలా శాఖ (postal department) ఓ బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. TATA AIG Insurance తో కలిసి తమ కస్టమర్ల కోసం గ్రూపు యాక్సిడెంట్ గార్డ్ పేరిట ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. ఏడాదికి రూ.399తో రూ. 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.
* 18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ బీమా పాలసీ తీసుకోవచ్చు.
* పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ బీమా తీసుకోవాలంటే పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఖాతా తప్పనిసరి.
* ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయం కోల్పోయినా , పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.
* ఏదైనా ప్రమాదం జరిగి పాలసీ తీసుకున్న వ్యక్తి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే ఐపీడీ కింద రూ.60 వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తం.. ఏదీ తక్కువైతే అది చెల్లిస్తారు.
* ఔట్ పేషెంట్ కు రూ.30 వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తం.. ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.
* విద్యా ప్రయోజనం కింద గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు రుసుములో 10 శాతం లేదా లక్ష రుపాయలు వరకు ఎంచుకోవచ్చు.
* కుటుంబ ప్రయోజనాల కోసం రూ.25 వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు అందిస్తారు.
* ఆసుపత్రిలో రోజువారీ నగదు కింద రోజుకు రూ.వెయ్యి చొప్పున 10 రోజుల వరకు అందజేస్తారు.
* ఇదే పథకంలో మరో ఆప్షన్ కూడా తపాలా శాఖ అందిస్తోంది. కేవలం ఏడాదికి రూ.299 చెల్లించినా రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. మృతి , వైకల్యం , పక్షపాతం, వైద్య ఖర్చులు వంటివి ఇందులో కవర్ అవుతాయి. రూ.399లో ఉండే మిగిలిన ప్రయోజనాలను ఇందులోంచి మినహాయించారు.
types of Group Accident Guard Policy
పాలసీలో రెండు రకాలు
ఇదొక గ్రూపు ఇన్సురెన్స్, అంటే చాలా మందిని కలిపి ఒక గ్రూపుగా ఫామ్ చేసి ఈ పాలసీ ఇస్తారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన తర్వాతే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీనిలో రెండు రకాలు ఉన్నాయి.
1.Basic Plan 2. Premium Plan
1.Basic Plan…
బేసిక్ ప్లాన్
బేసిక్ ప్లాన్ కింద సంవత్సరానికి కవరేజీ రూ.299. ప్రీమియం వచ్చేసి సంవత్సరానికి కవరేజీ రూ.399. మనం ఈ ప్లాన్ కింద రూ. 399 కట్టి ఈ పాలసీ తీసుకోవాలి. ఏటా రూ.299 కట్టాలి. పోస్టాఫీసుకి వెళ్లి కట్టాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత మనకి డాక్యుమెంట్ ఇస్తారు. పాలసీ కట్టిన తర్వాత పాలసీ యాక్టివేట్ లో ఉన్నప్పుడు పాలసీదారుడు యాక్సిడెంట్‌లో చనిపోతే మృతుని ఫ్యామిలీకి పోస్టాఫీసు రూ.10 లక్షలు ఇస్తుంది. అయితే మన ఫ్యామిలీ ఆ డాక్యుమెంట్ ను పోస్టాఫీసులో చూపించాల్సి ఉంటుంది. కాగా దీనికి ఒక షరతు ఉంది. యాక్సిడెంట్ కారణంగా ఏడాది లోపు చనిపోతే అప్పుడు పోస్టాఫీసు క్లెయిమ్ ఇస్తుంది.
Permanent Total Disability…
శాశ్వత వైకల్యం …
పాలసీ తీసుకున్న తర్వాత యక్సిడెంట్ అయ్యి కాళ్ళు, చేతులు కోల్పోయినా, మనం పనిచేయలేని స్థితిలో ఉంటే అప్పుడు పోస్టాఫీసు రూ.10 లక్షలు ఇస్తుంది. అంటే శాశ్వత అంగవైకల్యం పొందితే ఆ మొత్తం అందిస్తారు. అది కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత సంవత్సరం లోపు యాక్సిడెంట్ తీవ్రతను బట్టి మనకి ఇన్సురెన్స్ ఇస్తారు.
Permanent Partial Disability
శాశ్వత పాక్షిక వైకల్యం…
మనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత కళ్ళు పోయినా, చేతులు విరిగినా, మాట్లాడడటం లేకపోయినా ఇలాంటి సందర్భాల్లో కూడా ఇన్సురెన్స్ రూ. 10 లక్షలు ఇస్తారు.
పక్షవాతం వస్తే..
యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి పెరాలసిస్ ( పక్షవాతం) వస్తే ఒక సంవత్సరం లోపు వస్తే దాని కండిషన్ బట్టి ఇన్సురెన్స్ ఇస్తారు.
Accident Medical Expenses
ప్రమాద వైద్య ఖర్చులు
పాలసీదారుడికి యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన 24 గంటల కంటే ఎక్కువసేపు ట్రీట్ మెంట్ తీసుకుంటే అక్కడ ఎంతైతే ఖర్చు అయ్యిందో దానిలో మాగ్జిమమ్ లిమిట్ అంటే రూ. 60వేలను పోస్టాఫీసు ఇస్తుంది. ఒకవేళ చిన్న యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వెంటనే ట్రీట్ మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే పాలసీదారుడికి అయిన ఖర్చులో మాగ్జిమమ్ లిమిట్ రూ.30వేలను పోస్టాఫీసు ఇస్తుంది. మనం సంవత్సరానికి రూ.299 పోస్టాఫీసుకి కడితే ఇవన్నీ మనకి వస్తాయి.
Premium Plan
ప్రీమియం ప్లాన్…
ప్రీమియం ప్లాన్ కింద పాలసీ తీసుకుంటే ప్రతి సంవత్సరం రూ.399 కట్టాలి. పోస్టాఫీసుకి వెళ్లి ఈ మొత్తం కట్టాల్సి ఉంటుంది. పాలసీ కట్టిన తర్వాత పాలసీ యాక్టివేట్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి పాలసీదారుడు చనిపోతే అతని ఫ్యామిలీకి పోస్టాఫీసు ఈ ఇన్సురెన్స్ కింద రూ.10 లక్షలు ఇస్తుంది. అయితే ఈ పాలసీ తీసుకున్నప్పుడు మనకి ఇచ్చే డాక్యుమెంట్‌ను కచ్చితంగా పోస్టాఫీసుకు చూపించాలి. కాగా దీనికి ఓ షరుతు ఉంది. యాక్సిడెంట్ కారణంగా ఏడాది లోపు చనిపోతే అప్పుడు పోస్టాఫీసు క్లెయిమ్ ఇస్తుంది. బేసిక్ ప్లాన్ లానే ప్రీమియం ప్లాన్‌లోకూడా యక్సిడెంట్ లో కాళ్ళు పోయి, పనిచేయలేని స్థితిలో ఉంటే (Permenent Total Disability) అప్పుడు పోస్టాఫీసు రూ.10 లక్షలు ఇస్తుంది. అది కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత సంవత్సరం లోపు దాని తీవ్రతను బట్టి ఇన్సురెన్స్ ఇస్తారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కళ్ళు, చేతులు పోయినా, మాట్లాడటం లేకపోయినా (Permanent Partial Disability) ఇన్సురెన్స్ వర్తింపజేస్తారు.
యాక్సిడెంట్ అయిన తర్వాత పెరాలసిస్వ(Accident Dismemberment and Paralysis ) ఒక సంవత్సరం లోపు వస్తే దాని కండిషన్ బట్టి ఇన్సురెన్స్ ఇస్తారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆసుపత్రిలో చేరిన 24 గంటల కంటే ఎక్కువసేపు ట్రీట్ మెంట్ తీసుకుంటే అప్పుడు జరిగిన వైద్య ఖర్చులో (Accident Medical Expenses ) మాగ్జిమమ్ లిమిట్ రూ. 60వేలను పోస్టాఫీసు ఇస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ట్రీట్ మెంట్ తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లి పోతే పాలసీదారునికి అయిన వైద్యఖర్చులో మాగ్జిమమ్ లిమిట్ రూ.30వేలను ఇస్తారు.
Education Benifits
విద్య ప్రయోజనాలు…
ప్రీమియం ప్లాన్‌లో పై ప్రయోజనాలతోపాటు మరో బెనిఫిట్ కూడా ఉంది.అదేమిటంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మంచాన పడి పనిచేయలేకపోతే పాలసీదారుని పిల్లల చదువుకోసం పోస్టాఫీసు నుంచి 10 శాతం సమ్ ఇన్సుర్డ్ వస్తుంది. ఇద్దరు పిల్లలకి కలిపి రూ.లక్ష ఇస్తారు.
In Hospital Daily Cash
ఆసుపత్రిలో రోజువారీ నగదు
యాక్సిడెంట్ జరిగిన తర్వాత పాలసీదారు హాస్పిటల్ లో అడ్మిట్ అయితే రోజువారి ఖర్చులకు పోస్టాఫీసు రోజుకి రూ.1000 ఇస్తుంది. ఇలా 10 రోజులు ఇస్తుంది. అది ఎప్పుడంటే పాలసీదారు కుటుంబసభ్యలు పోస్టాఫీసుకి వెళ్లి ఈ స్కీమ్ కడుతున్నాం అని వాళ్ళకి చెప్పి ఫ్రూఫ్స్ చూపించాలి. అప్పుడే రోజువారీ వైద్య ఖర్చుల కింద కొంత మొత్తం చెల్లిస్తారు.
Family Transportation Benefits
కుటుంబ రవాణా ప్రయోజనాలు…
పాలసీదారుడికి యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత అతని పిల్లలు ఎక్కడో దూరాన ఉంటే వాళ్ళు అతడిని చూడడానికి రావడానికి అయ్యే ఖర్చును పోస్టాఫీసు భరిస్తుంది. మాగ్జిమమ్ లిమిట్ రూ. 25వేలు వరకు ట్రాన్సపోర్ట్ ఖర్చును పోస్టాఫీసు ఇస్తుంది. కానీ మినిమమ్ 150 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి.
Last Rites Benefits …
అంత్యక్రియల ప్రయోజనాలు…
పాలసీదారుడు యాక్సిడెంట్‌లో చనిపోయినా, లేదా ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మరణిస్తే వెంటనే పోస్టాఫీసు వారు అంత్యక్రియలకు మాగ్జిమమ్ రూ.5వేలు ఇస్తారు. అయితే పై ప్రయోజనాలన్నీ మనం పొందాలంటే ప్రీమియమ్ రూ. 399 కడితే సరిపోతుంది.
who are eligible
అర్హులు వీరే..
ఈ పాలసీకి 18 నుంచి 65 సంవత్సరాల మధ్య లోపు వారే అర్హులు. సంవత్సరానికి రూ.399 చెల్లించి పాలసీని తీసుకున్న తర్వాత ఏడాది చివరిలో అంటే ఇయర్ ఎండింగ్‌లో మళ్ళీ ఆ పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. ఇది తప్పనిసరి. లేకుంటే పాలసీ పనిచేయదు. ఎవరికైతే పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది. ఆత్మహత్య చేసుకున్నవారికి, ఆర్మీ వాళ్ళకి ఈ పాలసీ రాదు. జబ్బుతో బాధపడినవారికి, స్పోర్ట్స్ లో చనిపోయినవారికి కూడా ఈ పాలసీ రాదు.
పోస్టుమాస్టర్లను సంప్రదించడం ద్వారా లేదా ఐపీపీబీ అకౌంట్ నుంచి నేరుగా మనం ఈ పాలసీని పొందవచ్చు.
How to apply claim in Group Accident Guard Policy
క్లెయిమ్ ఎలా చేయాలి
పాలసీదారుడికి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఈ నెంబర్‌కు 5616181 SMS చేయవచ్చు. లేదా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు 18002667780, 1800229966 ఫోన్ చేయవచ్చు. లేదా general.claims@tataaig.com ఈ మెయిల్‌కు వివరాలు పంపించి క్లెయిమ్ చేసుకోవచ్చు.
These documents should be given
ఈ డాక్యుమెంట్లు ఇవ్వాలి
ఒకసారి క్లెయిమ్ రిజిస్ర్టర్ అయితే ఈ క్రింది డాక్యుమెంట్లను SUBMIT చేయాల్సి ఉంటుంది.
పాలసీ డాక్యుమెంట్
పాలసీదారుని పేరు
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం, డేట్ అండ్ టైమ్
యాక్సిడెంట్ జరిగిన విధానం..
తదితర వాటిపై సమీపంలో పోలీస్‌స్టేషన్‌లో సర్టిఫికెట్ పొందాలి.
పాలసీదారుడికి ట్రీట్‌మెంట్ జరిగితే ఎడ్మిట్ అయిన ఆసుపత్రి పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అందించాల్సి ఉంటుంది.