
ఇటీవల మ్యూచువల్ ఫండ్లపై ప్రజలకు చాలా ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఇక్కడ లాభాలు సంపాదించడం సులభం అన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి. అయితే ఈ లాభాలు ఏ ప్రాతిపదికన సాధ్యమవుతాయోనన్న విషయంలో అందరికీ చాలా సందేహాలు ఉంటాయి. మనం సేవ్ చేసిన డబ్బు ఎంత కాలానికి ఎంతగా లాభాలను ఆర్జించి పెడుతుందో తెలుసుకుంటే మరింత నమ్మకంతో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు కొనసాగించడం సాధ్యమవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న ఒక బేసిక ఫార్ములా గురించి తెలుసుకుందాం. అదే 15*15*15.. అంటే ఏంటో ఓ లుక్కేద్దాం.
is it possible to make sufficient money
అక్షరాలా కోటి రూపాయలు
మనం కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత కాలం పడుతుంది అని అందరూ ఆలోచిస్తుంటారు. ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులతో కోటి రూపాయాలను సంపాదించవచ్చు. 15 సంవత్సరాల పాటు నెలకు 15 వేలు చొప్పున సిప్ చేస్తూ పోతే 15 సంవత్సరాలు ముగిసిన తర్వాత కోటి రూపాయలు మన చేతిలో ఉంటాయి. ఇక్కడ సుమారు 15 శాతం వడ్డీ మనం పొందడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇదే 15*15*15 ఫార్ములా
mutual funds are better option to make good money
స్టాక్ మార్కెట్టే కానీ..
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే పరోక్షంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడమే. అందుకే దీనిలో నష్టభయం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్టర్స్ తరపున ఇన్వెస్ట్ చేస్తారు. దీనిలో వచ్చే రాబడి దీర్ఘకాలంలో ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం చేయడం వల్ల లాభనష్టాలు ఏవరేజ్ చెయ్యబడతాయి. ప్రతి సంవత్సరం 15 శాతం ఆదాయం వచ్చే ఫండ్స్ లో ఇన్వెస్టర్స్ చేస్తున్నట్లయితే వరుసగా 15 ఏళ్ళ పాటు , నెలకు 15 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కాలపరిమితి ముగిసిన తర్వాత మనకి వచ్చే మొత్తం రూ.1 కోటి అవుతుంది. మనం మొత్తం పెట్టుబడి పెట్టేది రూ.27 లక్షలు. మనకి వచ్చే లాభం – రూ.73 లక్షలు
ఒక వేళ మనం పెట్టే పెట్టుబడి మరో 15 సంవత్సరాలు కొనసాగిస్తే మన సంపద ఎక్కువ పెరుగుతుంది. 30 ఏళ్ళలో మనం పెట్టే పెట్టుబడి –రూ.54 లక్షలు
మన చేతికి వచ్చే మొత్తం – రూ.10.38 కోట్లు, లాభం – రూ.9.84 కోట్లు.
రెండు మార్గాలు..
1.సిప్ మార్గం. 2. మనీ కాంపౌండింగ్
మనం సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గులను అధిగమించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే మన రాబడిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తే స్టాక్ మార్కెట్ పై కొంత అవగాహన వస్తుంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్ల నుంచి ఎప్పుడైనా మనం బయటకు రావచ్చు. పైగా ఏదైనా ఫండ్ మంచి రాబడిని రాకపోతే వెంటనే వేరేదానికి బదిలీ అవ్వవచ్చు. డబ్బు కాంపౌండింగ్ ని ఆసరాగా చేసుకొని తక్కువ నష్టభయంతో ఎక్కువ సంపాదించాలంటే 15*15*15 రూల్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.