
మనమంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాం. ఎక్కువ లాభాలను సంపాదించాలని ప్రయత్నిస్తుంటాం. స్టాక్ మార్కెట్ అంటేనే నాలెడ్జ్ గేమ్. పూర్తి సమాచారం, అవగాహన ఉంటే గానీ మనం స్టాక్ మార్కెట్‌లో రాణించలేం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మనకు ఉండదు. ఈ సమాచారం అంతా ఎక్కడ దొరుకుతుందో అన్న విషయంలో కూడా మనకు ఓ క్లారిటీ ఉండదు. అయితే మార్కెట్‌కు సంబంధించిన సమాచారం అంతా తెలుసుకునేందుకు మనకు కొన్ని వెబ్‌సైట్‌లు, మార్కెట్ టూల్స్ ఉపయోగపడతాయి. ఆ వెబ్‌సైట్లు ఏంటి? వాటిని ఎలా వినియోగించుకోవాలి? వాటిలో ఉండే సమాచారం ఏంటి తదితర విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
Google alerts
ఇందులో మనం పేజ్ ఓపెన్ చేసి తర్వాత మన గూగుల్ అకౌంట్ ఏదైతే ఉన్నదో దాని నుంచి లాగిన్ అయి సైన్ ఇన్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో సెర్చ్ బాక్స్ లో మనం ట్రాక్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వివరాలు మనం టైప్ చేస్తే దానికి సంబంధించిన ఏ సమాచారం అయిన మనకి మెయిల్ రూపంలో అలెర్ట్ వచ్చేస్తుంది.
Eaindustry.nic.in
మనం కమొడిటీ కెమికల్స్ లో ఇన్వెస్ట్ చేసినపుడు వాటి ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో ట్రాక్ చెయ్యడం ముఖ్యం. చాలామందికి ఆ ప్రైస్ మూవ్ మెంట్ ఎక్కడ ట్రాక్ చెయ్యాలో తెలియదు. దీని కోసం మనం Eaindustry.nic.in వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి డ్రాగ్ చేస్తే అక్కడ హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ కనిపిస్తుంది. అక్కడ మనం డేటాను ఇయర్లీ లేదా మంత్లీ గాని ట్రాక్ చెయ్యవచ్చు. ఇక్కడ బల్క్ కెమికల్ పేరు టైప్ చేసి కాస్టిక్ సోడా ప్రైస్ ఎలా మూవ్ అయ్యిందో తెలుసుకోవచ్చు. సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రైస్ మూవ్ మెంట్ కనిపిస్తుంది. మనం ఇలా కమోడిటీ కెమికల్స్ ప్రైస్ ని ట్రాక్ చెయ్యవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ట్రాక్ చెయ్యవలిసిన టూల్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది
Rupeevest.com
ఈ వెబ్ సైట్లో మనం టూల్ సెక్షన్ కి వెళ్తే రకారకాల టూల్స్ కనిపిస్తాయి. మనం ఫండ్ ని సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి ఆ ఫండ్ రిలేటెడ్ వివరాలను తెలుసుకోవచ్చు. ఏ ఫండ్ దీర్ఘకాలంలో లాభాలను ఇస్తుందో, ప్రస్తుతం ఏ ఫండ్ పనితీరు బాగుందో, మన అవసరాలకు ఎలాంటి ఫండ్ సరిపోతుందో తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది.
ఇండియన్ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ రిలేటెడ్ టూల్స్
Goindiastocks.com
ఈ వెబ్ సైట్ పూర్తిగా స్టాక్ రీసెర్చ్ రిలేటెడ్ టూల్. ఈ వెబ్ సైట్లో మనం చాలా డెప్త్ గా స్టాక్ రిలేటెడ్ రీసెర్చ్ చెయ్యవచ్చు. ఇది చాలా అడ్వాన్స్ డ్ ప్లాట్ ఫామ్. ఇందులో ఫండమెంటల్ గా కాకుండా టెక్నికల్ గా కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఈ రీసెర్చ్ ఆధారంగా మనం స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్లాన్ చేయవచ్చు.
Screener.in
ఈ వెబ్ సైట్లో స్టాక్ రీసెర్చ్ చాలామంది చేస్తుంటారు. కానీ మనం ఆ కంపెనీలు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో వాటిని ఫాలో అయితే ఆ కంపెనీ రిలేటెడ్ గా వచ్చిన ప్రతి ఎక్స్చేంజీ ఫైల్ ని మనం ట్రాక్ చెయ్యవచ్చు. ఒక కంపెనీ కాకుండా రెండు మూడు కంపెనీలను మనం యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసిన కంపెనీల ఎక్స్చేంజీ ఫైలింగ్స్, అప్ డేట్స్ మనకి ఫీడ్ సెక్షన్ లో వచ్చేస్తాయి.
మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీల్లో ఎక్స్చేంజీ ఫైల్స్ చదవడం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇందులో చాలా సమాచారం దొరుకుతుంది. ఇలా చదివితేనే మిగిలిన ఇన్వెస్టర్స్ కంటే మనం బెటర్‌గా వ్యవహరించగలుగుతాం.
Tijori finance.in
ఈ వెబ్ సైట్లో చాలా సమాచారం దొరుకుతుంది. ఈ వెబ్ సైట్లో టైమ్ లైన్ అనే సెక్షన్ ఉంటుంది. ఇందులో కంపెనీస్ రిలేటెడ్ గా ఓన్లీ ఎక్స్చేంజీ ఫైల్స్ కాకుండా వేర్వేరు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఒకే చోట దొరుకుతుంది. ఈ వెబ్ సైట్లో మనం లాగిన్ అయితే మనం ఫాలో అవుతున్న కంపెనీస్ గానీ, లేదా అన్ని కంపెనీల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనం ఫాలో అవుతున్న కంపెనీస్ డేటాను మనం ట్రాక్ చెయ్యాలంటే ఈ టైమ్ లైన్ సెక్షన్ లో మనం ట్రాక్ చెయ్యవచ్చు. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో కూడా వేరే టూల్స్ ని పెట్టారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం రూ. 500 కోట్లు కంటే తక్కువ మార్కెట్ కాపిటల్ ఉన్న కంపెనీలను ట్రాక్ చెయ్యకూడదనుకుంటే అక్కడ మనం ఆ నంబర్ ని ఇన్ పుట్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు.
alfa street india
మనలో చాలామంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. దానికి సంబంధించి కాన్ఫరెన్స్ కాల్స్ జరుగుతుంటాయి. మనం అలాంటి టైమ్ లో హాజరుకాకపోతే తర్వాత ఆ కాల్స్ రికార్డ్ వినడానికి alfa street india అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయ్యండి. ఈ యూట్యూబ్ చానల్‌లో కాన్ఫరెన్స్ కాల్స్‌ని ఫ్రీగా వినవచ్చు.
Finviz.com
ఇందులో యూఎస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా సమాచారాన్ని అందిస్తుంది. ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ న్యూస్ ఏదైతే ఉంటుందో బిజినెస్ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో Finviz.com వెబ్ సైట్లో చూడవచ్చు. ఈ వెబ్ సైట్లో ఇంటర్నేషనల్ డేటా మొత్తాన్ని మనం ట్రాక్ చేయవచ్చు.
Quickfs.net
మనం ఇంటర్నేషనల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే అని ఎలా ట్రాక్ చేయాలో ఈ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు. ఇందులో యూఎస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వేరియస్ స్టాక్ డేటాను చూడవచ్చు. ఇందులో కూడా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనం యూఎస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెర్చ్ చెయ్యాలంటే ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది.
Dataroma.com
యూఎస్ లో పెద్దపెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ లార్జ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలుసుకోవడానికి Dataroma.com వెబ్ సైట్ ని వాడుతాం. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పై క్లిక్ చేస్తే వాళ్ళ పోర్ట్ ఫోలియో మనకి కనిపిస్తుంది. అందులో వాళ్ళు ఏఏ స్టాక్స్ హోల్డ్ చేశారో మనకి తెలుస్తుంది. 1 శాతం కంటే ఎక్కువ హోల్డింగ్ చేసే వారి డేటా మాత్రమే మనకి దొరుకుతుంది. ఒక శాతం కంటే తక్కువ హోల్డింగ్ ఉన్న వారి వివరాలు మనకు ఎవైలబుల్ గా ఉండవు.
మరింత స్టాక్‌మార్కెట్ సమాచారం కోసం
For more stock market information
ఇంకా మనకు స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ డిటైల్స్, స్టాక్‌ల గురించి కనీస సమాచారం తెలియాలంటే ఎన్నో సంప్రదాయ వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయి. మనం ఉపయోగించే డీ మ్యూట్ బ్రోకర్స్ కూడా కొన్ని ప్రత్యేక యాప్‌ల ద్వారా కనీస సమాయచారాన్ని ఫ్రీగా అందిస్తుంటారు. money control.com, tickertape.com, valueresearchonline.com లాంటి వెబ్‌సైట్ల నుంచి స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్ల సమాచారం పొందవచ్చు.
CA rachana phadke ranade యూ ట్యూబ్ చానల్ ద్వారా ఫైనాన్స్, స్టాక్ మర్కెట్‌కు సంబంధించిన ఎంతో సమాచారం పొందవచ్చు.
ఇక మన తెలుగులో MONEY PURSE (మనీపర్స్), DAY TRADER TELUGU (డే ట్రేడర్ తెలుగు) వంటి యూట్యూబ్ చానళ్లు పూర్తి డెడికేటెడ్‌గా, నిస్వార్ధంగా మనకు స్టాక్ మార్కెట్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఎంతో సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో కూడా చాలా సమాచారం మనకు అందుబాటులో ఉంది. వీటిని ఫాలో అవుతూ నాలెడ్జ్‌ను పెంచుకోవచ్చు.