ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ ధనవంతులు అవ్వాలనే ఆశ ఉంటుంది. కానీ అది అంద‌రికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఏ మనిషికైనా ఆశ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా మన ఆలోచనలు కూడా మార్చుకోవాలి. ప్రతి మధ్య తరగతివాళ్ళుకీ వచ్చిన జీతంతో ధనవంతులు కావ‌డానికి అవకాశం ఉంటుంది. కాక‌పోతే దానికి మనం కొన్ని సూత్రాలను తెలుసుకుని పాటించాలి. ఇలా క్ర‌మం తప్పకుండా ఈ నిబంధ‌న‌ల‌ను పాటిస్తే మనం ధనవంతులు అవ్వగలం. ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం …

Save minimum 20% from your salary
మనకి వచ్చిన జీతంలో నుంచి మనం 20 శాతం సేవ్ చేసుకోవాలి.
మనకి వచ్చిన జీతం మనకి సరిపోదు అనుకుంటాం. కానీ మన సేవింగ్ అనేది జీతంతో సంబంధం ఉండదు. మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. మన జీతంలో ఎంతో కొంత సేవ్ చేసినా అది మన భవిష్యత్తులో అత్యవసరమైన ఖర్చులకు ఉపయోగపడుతుంది.

Start Controlling Your Expenses
మనం ఎప్పుడు కూడా ఒక బ్యాలన్స్ షీటు మెంటైన్ చెయ్యాలి. మనకి ఎంత ఆదాయం వస్తుంది… అందులో ఎంత ఆదాయం ఖర్చు అవుతుంది… అనే దాని కోసం మనం బ్యాలన్స్ షీటు మెంటైన్ చెయ్యాలి. మన ఇన్ కమ్ కంటే ఖర్చు ఎక్కువ అయితే మనం అప్పులు చేయవలిసి ఉంటుంది. ఇది మనం ఆలోచించుకోవాలి.

what is difference between Wants-Needs
అవసరాలకూ, కోరికలకీ చాలా తేడా ఉంటుంది. మనకి తప్పనిసరిగా కొన్ని అవసరం ఉంటాయి. కానీ కొన్ని మనకి ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. ఇందులో మొద‌టిది అవ‌స‌రం, రెండ‌వ‌ది కోరిక‌.
ఇందులో అవ‌స‌రాలు త‌ప్ప‌నిస‌రి. వీటిని ఎలాగైనా మ‌నం స‌మ‌కూర్చుకోవాల్సిందే. కానీ కోరిక‌లు అనేవి లేక‌పోయినా ప్ర‌స్తుతానికి ఇబ్బంది లేదు. కానీ కొంత‌మంది అలాంటివాటి కోసం అప్పులు చేస్తే
చాలా సమస్యల్లోకి వెళ్ళిపోవ‌డం ఖాయం. అలా అయితే మ‌నం ఎప్పటికీ ధనవంతులు అవ్వలేం. అందువలన కోరికలకి, అవసరాలకి తేడా మనం గమనించి ఖర్చు చేసినవాళ్ళు అప్పుల‌పాలవ్వరు.

Make your money multiply
మనం సేవ్ చేస్తున్న మనీ అనేది మ‌న‌కి త‌ప్ప‌కుండా అధిక దిగుబ‌డిని ఇవ్వ‌గ‌ల‌గాలి. అలా అయితే మ‌నం డ‌బ్బును అధిక రెట్లు చేయ‌గ‌లుగుతాం. ఇలా అధిర దిగుబ‌డి రావాలంటే ఏం చేయాలో, ఎక్క‌డ పెట్టాలో తెలుసుకోవాలి.

Savings- investing
మనం సేవ్ చేసే డబ్బులను మన దగ్గర దాచుకుంటే దాని విలువ రాను రాను పడిపోతుంది. అందువలన మనం సేవ్ చేసే డబ్బులను స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్ లేదా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ పెరుగుతుంది.లేదా మ‌రెక్క‌డైనా అధిక రాబ‌డిని చ‌క్క‌ని విధానంలో ఇవ్వ‌గ‌లిగితే దానిని మ‌నం ఎంచుకోవ‌చ్చు.

how to Protect your Wealth
సంపదను మనం కాపాడుకోవాలి. అంటే మనం దేనిలోనైనా ఇన్వెస్ట్ చేస్తే మనకి లాస్ రాకుండా కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి. పైగా మన సంపదను కాపాడుకోవాలంటే మనం తప్పకుండా ఇన్సురెన్స్ పాలసీని తీసుకోవాలి. ఎందుకంటే మనం పాలసీని తీసుకుంటే మనకి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినా మన కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది.
మనం ఏదైనా బిజినెస్ చేసిన కూడా దానికి కూడా మనం ఇన్సురెన్స్ తీసుకోవాలి. మనం లైఫ్ ఇన్సురెన్స్ కూడా తీసుకోవాలి. లైఫ్ ఇన్సురెన్స్ చాలా ముఖ్యం. దీనినే మనం Wealth cover అని కూడా అంటాం.

Protect your capital
మనకి అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోతే మనం అప్పులు చేసి ట్రీట్మెంట్ చేసుకోవలిసి ఉంటుంది. అప్పుడు మన క్యాపిటల్ తగ్గిపోతుంది. కాబట్టి మనం తప్పకుండా హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవాలి. దీనివలన మన ట్రీట్ మెంట్ అయ్యే ఖర్చు ఇన్సురెన్స్ కంపెనీవాళ్ళు భరిస్తారు.

Make your living place profitable
మనం నివసిస్తున్న ఇళ్లు మనకి ప్రాఫిట్ ఇస్తుందా లేదా నష్టం ఇస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. మనకి వచ్చిన జీతంలో 50 శాతం దాటకుండా మనం లోన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ లోన్ తీసుకుంటే మనకి వ‌చ్చిన జీతం ఈఎంఐ కట్టడానికి సరిపోతుంది. అప్పుడు మిగిలిన ఖర్చులకు మనం అప్పులు చేయవలిసి ఉంటుంది. మన బడ్జెట్ ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ ప్లాన్ చేయకుండా ఇల్లు కొంటే తర్వాత అన్ని విషయాల్లో సర్దుకుపోవలిసి ఉంటుంది.

Increase Your Earning capacity
మన దగ్గర ఉన్నస్కిల్స్ బట్టి కూడా మనకి పాసివ్ ఇన్ కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర ఉన్న మనీని దేనిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్ కమ్ వస్తుంది.. ఇంకా మనకి ఇన్ కమ్ వచ్చే మార్గాలు ఏవైనా ఉన్నాయో అని మనం తెలుసుకుని అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే దానిద్వారా వచ్చే పాసివ్ ఇన్ కమ్ మనల్ని ధనవంతుల్ని చేసే అవకాశం ఉంటుంది.

Don’t depend on single source of income
మనం ఎప్పుడు కూడా ఒకే ఉద్యోగం లేదా వ్యాపారంపై ఆధారపడి ధనవంతులు కాలేం. మనం చేస్తున్న ఉద్యోగం కొన్ని సంవత్సరాల‌ తర్వాత ఉండ‌క‌పోవ‌చ్చు. అప్పుడు మనకి వేరే మార్గాల ద్వారా ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఏమి ఉన్నాయో తెలుసుకోవాలి. మన ద‌గ్గర ఉన్న స్కిల్స్ ఏమిటి, మనం ఏం నేర్చుకుంటే భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతాం అనేది బాగా తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకోగలిగినప్పుడు మాత్రం మనం ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే క‌నీసం రెండు లేదా మూడు మార్గాల్లో ఆదాయాన్ని స‌మ‌కుర్చుకుంటేనే మ‌నం త్వ‌ర‌గా ధ‌న‌వంతులం కాగ‌లం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *