ఇన్వెస్ట్ మెంట్ అంటే తక్కువ అమౌంట్ తో ఎక్కువ రిటర్న్స్ ని జనరేట్ చేసే తెలివైన‌ విధానం.
చాలా మంది ఇన్వెస్ట్ మెంట్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లేదా కొత్త అసెట్స్ ఏవైనా కొనడం అని అనుకుంటారు. కానీ ఇన్వెస్ట్ మెంట్ అంటే మనం ఏదైనా కొత్త స్కిల్ ని నేర్చుకుంటున్నప్పుడు  అంటే మనం కొంత ఖర్చు పెడితే ఎక్కువ మనీ జనరేట్ అయ్యే దానిని కూడా మనం ఇన్వెస్ట్ మెంట్ అనుకోవాలి. అంతేగానీ మన దగ్గర ఉన్న డబ్బు తీసుకుని వెళ్ళి కనిపించినా ప్రతి దానిలో ఇన్వెస్ట్ చేయడం కాదు.

ఉన్నవాటిలో ఎది బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆపర్చ్యునిటీ అనేది మన రిస్క్ ప్రొఫైల్ బట్టి, మన స్కిల్స్ బట్టి, మన ఫైనాన్షియల్ గోల్స్ ని బట్టి ఉంటుంది. డిఫరెంట్ వేస్‌ ఆఫ్ రిస్క్ ప్రొఫైల్స్ ఉండాలి. అందువల్ల ఒకరి దృష్టిలో ఇన్వెస్ట్ మెంట్ అనేది వేరేవారి దృష్టిలో స్పెక్యులేషన్ కావ‌చ్చు. కానీ మ‌న‌కు బ‌ల‌మైన న‌మ్మ‌కం ఇన్వెస్ట్ మెంట్ మీద భ‌రోసాను క‌లిగిస్తుంది.

మనలో ఉండే సృజనాత్మకతను బయటకు తీసుకువ‌చ్చి, ఆలోచ‌న శ‌క్తికి ప‌దునుపెడితే మ‌రింత మెరుగ్గా ఇన్వెస్ట్ మెంట్ చేయ‌వ‌చ్చు.

మనల్ని ధనవంతులను చేసే ఇన్వెస్ట్ మెంట్స్ చాలా రకాలుగా ఉన్నాయి. వీటిలో స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, ఈటీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్స్.

STOCK MARKET INVESTMENTS

మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే తొందరగా ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు.

షేర్ మార్కెట్లో సంపాదించాలని భావిస్తే ముందుగా కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి.
ఇందులో మొదటిది మనకి రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. ఈక్విటీ మార్కెట్లో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. వేగంగా నష్టాలు రావచ్చు. రాంగ్ స్టాక్ ను ఎంచుకుంటే పెట్టిన డబ్బు పోగొట్టుకోకతప్పదు.

ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు డబ్బు సంపాదించాలంటే రెండు విషయాలను ఖచ్చితంగా ఫాలో కావాలి.  ఏ స్టాక్ ను కొనాలి ? కొన్న స్టాక్ ను మళ్ళీ ఎప్పుడు విక్రయించాలి? అనే రెండు విషయాలను తెలిసి ఉండాలి.

ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీయస్, ఐషర్ మోటార్స్, రిలాక్సో ఫుట్ వేర్, అవంతి ఫీడ్స్ వంటి పలు స్టాక్స్ గత 10-15 ఏళ్ళలో ఇన్వెస్టర్లను మిలీనియర్లను చేశాయి.

సరైన స్టాక్స్ ను ఎంచుకోవడానికి మనం ఆర్థిక మేధావి కావాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అర్థం చేసుకోవడంతో పాటు ఇతర అంశాలపై కొంత అవగాహన  ఉంటే సరిపోతుంది.

INVESTMENT IN BONDS

బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. బాండ్ అనేది ఒక రకమైన సుర‌క్షిత పెట్టుబ‌డి విధానం. ఇక్క‌డ కంపెనీలు హోల్డర్ల నుంచి రుణం తీసుకుంటాయి. మెచ్యూరిటీ సమయం పూర్త‌యిన త‌రువాత బాండ్ విలువ‌ను చెల్లించడానికి అనేక నిబంధనలు ఉంటాయి. ఇందులో వడ్డీని సాధారణంగా నిర్ణీత వ్యవధిలో క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లిస్తారు.

బాండ్ అనేది ఒక రుణం.
కంపెనీలు త‌మ వ్యాపార విస్త‌ర‌ణ‌కు, ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన నిధుల‌ను ప్ర‌జ‌ల నుంచి సేక‌రించ‌డానికి ప్ర‌య‌త్నించే క్ర‌మంలో బాండ్ల‌ను విడుద‌ల చేస్తాయి. బాండ్ల రూపంలో రుణాల‌ను సేక‌రిస్తాయి. అంటే నిబంధ‌న‌ల మేర‌కు బాండ్ల‌ను విక్ర‌యించి ప్ర‌జ‌ల నుంచి రుణాల‌ను తీసుకుంటాయి. నిర్ణీత మొత్తంలో వ‌డ్డీని క్ర‌మం త‌ప్ప‌కుండా ఇక్క‌డ కంపెనీలు రుణ‌దాత‌ల‌కు చెల్లిస్తాయి. అలా తీసుకున్న రుణాల‌ను కంపెనీలు త‌మ ఆర్థిక అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకుంటాయి.
ఇక్క‌డ కార్పొరేట్ బాండ్లు, ప్ర‌భుత్వ బాండ్లు, ఆర్బీఐ బాండ్లు వంటివి ఉంటాయి.

కంపెనీలు షేర్ ల‌ను విక్ర‌యించి కూడా ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు తీసుకుంటాయి.
కానీ షేర్ల‌కు, బాండ్ల‌కు ఉన్న ప్ర‌ధాన‌మైన తేడా ఏమిటంటే స్టాక్ హోల్డర్లు కంపెనీలో ఈక్విటీ వాటాను కలిగి ఉంటారు. కానీ బాండ్ హోల్డర్ కంపెనీలో రుణదాతలుగా మాత్ర‌మే ఉంటారు. అంటే కేవ‌లం అప్పు ఇచ్చి వ‌డ్డీ మాత్ర‌మే తీసుకుంటారు.
* బాండ్లను ఎక్కువ‌గా సెంట్రల్ బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్ష‌న్ ఫండ్స్, ఇన్సురెన్స్ కంపెనీలు, బ్యాంకులు వంటి సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

REAL ESTATE INVESTMENT

రియల్ ఎస్టేట్ అంటే వాస్తవ ఆస్తి అని అర్థం. నిజమైన ఆస్తి అని కూడా అంటారు. ఇక్క‌డ మ‌న‌కు క‌ళ్ల‌కు ప్ర‌త్య‌క్ష్యంగా మ‌న సంప‌ద క‌నిపిస్తుంది.  భూమి, భవనాలు, దీనితో పాటు సహజ వనరులైన పంటలు, ఖనిజాలు, నీరు ఇవ‌న్నీ ప్రకృతి సిద్ధ‌మైన ఆస్తులు. వీటిపై ఎవ‌రైతే పెట్టుబడి పెడ‌తారో వారంతా వాస్త‌విక లాభాల‌ను పొందుతారు.

* భూమి, భవనాలు లేదా గృహాలను కొనడం, అమ్మడం లేదా అద్దెకు లేక లీజుకు ఇవ్వడం, తీసుకోవడం వంటివ‌న్నీ రియ‌ల్ ఎస్టేట్‌లోకి వ‌స్తాయి.

మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రికీ సొంత ఇళ్లు కొనుక్కోవ‌డం అనేది క‌ల‌గా ఉంటుంది. ఇలా ఇళ్లు క‌ట్టుకున్న త‌ర్వాత దాని విలువ క్ర‌మంగా పెరుగుతుంది. అంటే ఆ ఇంటిపై మ‌నం పెట్టిన పెట్టుబ‌డికి వ‌చ్చే ప్ర‌తిఫ‌లం కూడా పెరుగుతుంది.

* అద‌నంగా మ‌రో ఇళ్లు కొనుక్కుని దానిని అద్దెకిచ్చి అలా ప్ర‌తి నెలా ఆదాయం పొంద‌డం కూడా ఒక మార్గమే. ఇక్క‌డ అద్దెతో పాటు ఇంటి విలువ కూడా కొంత కాలానికి పెరుగుతుంది. ఇలాంటి పెట్టుబ‌డుల‌న్నీ మ‌న‌ల్ని ధ‌న‌వంతుల‌ను చేస్తాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.

* రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టాలంటే చాలా అధిక మొత్తంలో డ‌బ్బులు కావాల్సి ఉంటుంది. ఇది సాధార‌ణ ఇన్వెస్ట‌ర్ల‌కు కొంత క‌ష్ట‌మైన పెట్టుబ‌డి సాధ‌నం. ఎవ‌రైతే అధిక మొత్తంలో మిగులు నిధుల‌ను క‌లిగి ఉంటారో, కొంత కాలం వ‌ర‌కూ ఆ డ‌బ్బులు ఎక్క‌డైనా పెట్టి ఎదురు చూడ‌గ‌ల‌రో అలాంటి వారే రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డుల‌కు స‌రైన వాళ్లు.

* కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే కంపెనీగా ఏర్పాటు చేసిందే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్  (REITS). రియ‌ల్ ఎస్టేట్ లో చిన్న చిన్న పెట్టుబ‌డులు పెట్టాలనుకునే వారు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చు. వీరికి నిర్ణీత మొత్తంలో లాభాలు క్ర‌మంగా వ‌స్తాయి.

MUTUAL FUNDS INVESTMENT

మ్యూచువల్ ఫండ్స్ అంటే నిర్ణీత ల‌క్ష్యాల‌తో పెట్టుబ‌డిదారుల‌కు లాభాల‌ను పంచాల‌నే స‌దుద్దేశంతో మ‌దుప‌రుల నుంచి నిధుల‌ను సేక‌రించి త‌యారు చేసిన ధ‌న నిధి.

అనేక మంది పెట్టుబడులదారుల నుంచి జమ చేసిన మొత్తాన్ని వృత్తిపరంగా నిర్వహిస్తూ దానిని స్టాక్లు, బాండ్లు, స్వల్ప కాలపరిమితి క‌ల‌ ద్రవ్యమార్కెట్ వస్తువులు, ఇతర సెక్యూరిటీలో సామూహిక పెట్టుబడులు పెట్టడం మ్యూచువల్ ఫండ్లో జ‌రుగుతుంది.

ఇలా పోగు చేసిన మొత్తంతో క్రమబద్ధంగా వర్తకం చెయ్యడానికి మ్యూచువల్ ఫండ్స్ కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. నికర లాభం, నష్టం పెట్టుబడిదారులకు ప్రతి సంవత్సరం ఒకే విధంగా పంపిణీ చేస్తారు. వ్యక్తిగత సెక్యూరిటీల్లో ప్రత్యక్ష పెట్టుబడులతో పోల్చితే మ్యూచువల్ ఫండ్ ప్రయోజనాలు కొంత స్థిరంగా ఉంటాయి.

మ్యూచువల్ ఫండ్ లో లాభాలు, స్కేల్, విభిన్నీకరణ, లిక్విడిటీ వంటి విష‌యాల‌న్నీ ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్ల‌కు ఫీజులు, ఖర్చులు కూడా ఉంటాయి. అయితే అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకే విధంగా ప‌నిచేయవు. మ్యూచువల్ ఫండ్స్ లో తమ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ మెంట్ అమౌంట్‌ను మనీ మార్కెట్స్‌, బాండ్ లేదా స్థిర ఆదాయ నిధులు, స్టాక్ లేదా ఈక్విటీ ఫండ్స్ ఇలా అనేక చోట్ల పెడ‌తాయి. పెట్టుబ‌డి విధానాల‌ను బ‌ట్టి మ్యూచువ‌ల్ ఫండ్స్‌ని అనేక ర‌కాలుగా వ‌ర్గీకరిస్తారు.

మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఓపెన్ ఎండ్ గా ఉంటాయి. అంటే కొత్త పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఫండ్ లో చేరవచ్చు. ఇలా వ‌చ్చినప్పుడు కొత్త వారి వాటాకు త‌గ్గ‌ట్టుగా వారికి కొత్త యూనిట్లు ఇస్తారు.

వేలాది రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కో ర‌కంగా ప‌నిచేస్తుంటాయి. వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, వివిధ రకాల వ్యాపారాలు, వివిధ పెట్టుబడి శైలిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాయి. ఇతర ఫండ్ లో మాత్రమే పెట్టుబడి పెట్టే కొన్ని ఫండ్స్ కూడా ఉన్నాయి.

* మన దగ్గర వినియోగించలేని సంపాదన ఉంటే దానిని స్టాక్ లో మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా మనం బయట ఇచ్చే బదులు స్టాక్ మార్కెట్లోనే  మనకి నిరంతరం ఇన్ కమ్ వస్తుంది.

మనం పైన తెలిపిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. దేనికైనా ఓర్పు, సహనం ఎక్కువ ఉండాలి.

We have to invest in ourselves
మ‌న మీద మ‌నం ఇన్వెస్ట్ చేసుకోవాలి

* బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఎప్పుడూ కూడా కేవ‌లం స్టాక్స్, గోల్డ్,  రియల్ ఎస్టేట్, హౌస్ ఇలాంటివి మాత్ర‌మే కావు. మన నాలెడ్జ్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం.  నాలెడ్జ్ నిరంతరం మెరుగుపర్చుకోవడం ద్వారా రిస్క్ ఏదైతే ఉందో అది మినిమైజ్ అయిపోతుంది. దాంట్లో కొత్త ఆపర్చ్యునిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది.

* తక్కువ రిస్క్ తో మల్టిపుల్ వేస్‌ లో మనీ ఎలా జనరేట్ చేసుకోవచ్చు..  విలువైన  ఫలితం ఆశించి ఒక నిర్ధిష్ఠ  పనికి సమయం, కృషి లేదా శక్తిని కేటాయించ‌డం కూడా ఒక ర‌క‌మైన ఇన్వెస్ట్ మెంటే.

* కొంతమంది హౌస్ లపై ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ రావచ్చు అని అనుకుంటారు. కొంతమంది ప్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ సాధిస్తారు. ఒకరి దృష్టిలో ఇన్వెస్ట్ మెంట్ అనేది వేరేవాళ్ళ దృష్టిలో  అది స్పెక్యులేషన్ అయి ఉండవచ్చు.  కానీ ఫైన‌ల్‌గా ప్రాఫిట్ పొంద‌డం కీల‌కం.

* మన నైపుణ్యాలను మెరుగుపరిచే సాధనాల‌పై మనం ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవాలి. స్కిల్ నేర్చుకున్న తర్వాత వచ్చే ఎచీవ్ మెంట్ కోసం నేర్చుకోవాలి.

* బెస్ట్ అప్రోచ్ ఎప్పుడు కూడా మన స్కిల్స్ పై మనం ఇన్వెస్ట్ చేసుకోవడం.  దానివల్ల కొత్త ఆపర్చ్యునిటీ క్రియేట్ అవుతాయి. మన మైండ్ ఓపెన్ అవుతుంది.

* మనలో ఉండే మేధస్సును బయటకి తీయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి.  మనం తక్కువ మనీ తో ఎక్కువ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. మన స్కిల్స్ పెరిగే కొద్ది ఎక్కువ రిటర్న్స్ వస్తాయి.

* నాలెడ్జ్ నిరంతరం ఇంప్రూవ్ మెంట్ చేసుకోవడం ద్వారా రిస్క్ మినిమైజ్ అయిపోతుంది. దాంట్లో కొత్త  అవకాశాలు మనకి కనబడుతూ ఉంటాయి.

* మనం తక్కువ రిస్క్ తో మల్టిపుల్ వేస్‌ లో మనీని జనరేట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ మెంట్ అనేది మనీ కే కాకుండా మిగతా వాటిపై కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు.  మనం ఖర్చులతో పోల్చుకుంటే ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటే దానిని మనం ఇన్వెస్ట్ మెంట్ తో పోల్చుకోవచ్చు.

బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఎప్పుడూ మన స్కిల్స్ పై మనం ఇన్వెస్ట్ చేసుకోవడమే. ఎందుకంటే దానిపై కొత్త అవకాశాలు క్రియేట్ అయి మైండ్ ఓపెన్ అవుతుంది.  అప్పుడు మనకి ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు అని మనకి తెలుస్తుంది. మనలో ఉండే మేథస్సు  బయటకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి.

చాలా మంది పిల్లలను స్కూల్లో ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టమంటారు. మిగతా యాక్టివిటీస్ పై ఇంటరెస్ట్ చూపించరు. కానీ పిల్లలకి డాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్ ఇలా అన్ని యాక్టివిటీస్ నేర్పిస్తే వాళ్ళు కొంచెం పెరిగాక  వీటితో కూడా పార్ట్ టైమ్ జాబ్ చేసి డబ్బులను సంపాదించగ‌ల‌రు. ఇలా వాళ్ళు మంత్లీ ఇన్ కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా డాన్స్ స్కూల్స్ లేదా కరాటీ స్కూల్స్ ఇలా సొంతంగా పెట్టుకుని  డబ్బులను సంపాదించవచ్చు.

ఇన్వెస్ట్ మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్.

తక్కువ మనీతో కూడా ఎక్కువ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది వారి వృత్తి చేస్కుంటూ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ స్కిల్ పెంచుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఈ విధంగా ఎన్నో ర‌కాలుగా మ‌నం అప్డేట్ అవుతూ ఉంటూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఫైనాన్షియ‌ల్‌గా మెరుగైన స్థితికి చేరుకోవ‌చ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *