టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఇంటి నుంచే ఆదాయం స‌మ‌కూర్చుకునే అవ‌కాశాలు చాలా పెరిగాయి. ఒక ఉద్యోగం ద్వారానో, ఒకే జీతంతోనే జీవనం సాగించే రోజులు కావివి. మ‌న‌కు ఉన్న టాలెంట్‌, టైంను ఉప‌యోగించుకుని రెండు మూడు మార్గాల్లో ఆదాయం స‌మ‌కూర్చుకుంటేనే ఒక కుటుంబం ముందుకు సాగుతుంది. ఇటీవ‌ల కాలంలో ఈ మ‌ల్టీ టాస్కింగ్‌పై ప్ర‌జ‌ల్లో విప‌రీతంగా ఆస‌క్తి పెరిగింది. ఆన్‌లైన్ వెసులుబుటును ఉప‌యోగించుకుని అధిక ఆదాయాన్ని సంపాదించే ప‌నిలో ప‌డ్డారు. అలాంటి వారికి ఉప‌యోగ‌ప‌డే కొన్ని ఆన్‌లైన్ అవ‌కాశాల‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం.

ఆన్ లైన్లో వర్క్ చేయడం వలన మనం 3 రకాలుగా ప్రయోజనాలు పొందవచ్చు.
1. ఆన్ లైన్లో చేసే జాబ్ కైనా, బిజినెస్ కైనా చాలా తక్కువ ఇన్వెస్ట్ మెంట్ ఉంటుంది.
2. ఆన్ లైన్ ఇన్ కమ్ అనేది చాలా సందర్బాల్లో పాసివ్ ఇన్ కమ్ జనరేట్ చేస్తుంది.
3. మనం ఒక Introvert అయినా కూడా మనం ఆన్ లైన్లో జాబ్ లేదా ఇన్వెస్ట్ మెంట్ గాని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

ఫోటోలు, వీడియోలు అమ్మడం
Selling photos and videos

మనం యూట్యూబ్ వీడియోలో గాని, మ్యాగజీన్ లోగాని, అడ్వటేజ్ మెంట్ లో చూస్తున్న ఫోటోలు, వీడియోలు కొన్ని సైట్ ల నుంచి కొనుక్కుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కంటెంట్ క్రియేటివ్ విపరీతంగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టు ఫొటోస్, వీడియోస్ దొరకడం కష్టమైపోయింది. మనం మంచి డిజిటల్ కెమెరాను ఉపయోగించి మంచి ఫొటోస్ తీసి ఇంతకుముందు చెప్పిన సైట్ లలో అప్ లోడ్ చేసి మంచి పాసివ్ ఇన్ కమ్ ని సంపాదించవచ్చు.

ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించడం
Starting Online Courses

కేవలం రూ.500, రూ.1000 లతో నేర్చుకునే కోర్సులు కేవలం ఆన్ లైన్లో సాధ్యమవుతుంది. పైగా ఎవరికి వీలైన సమయంలో వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇలాంటి కోర్సులు మనకి రాకపోయినా నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటే చాలు మనకి జీవితాంతం పాసివ్ ఇన్ కమ్ వస్తుంది.

E-Books

మనకున్న నాలెడ్జ్ ని ఒక పద్ధ‌తి ప్రకారం రాసుకుని దానిని ఒక ఈ బుక్ గా మార్చుకుని అమెజాన్ కి వెళ్ళి గూగుల్ ప్లే బుక్ లో అప్ లోడ్ చేస్తే ప్రతి ఒక్క సేల్ లేదా 50 నుంచి 60 శాతం రాయల్టీ ఇస్తారు. మనం ఒక వారమో లేదా నెల మన సమయాన్ని పెట్టుబడి పెడితే మనకి జీవితాంతం పాసివ్ ఇన్ కమ్ వస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే బిజినెస్, పర్సనల్ డెవలప్ మెంట్, షేర్ మార్కెట్ ఫైనాన్స్ కి సంబంధించి బుక్స్ బాగా అమ్ముడవుతున్నాయి. అవసరమైతే మన బుక్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయవలిసి ఉంటుంది.

Podcast

మన టాలెంట్ ని, నాలెడ్జ్ ని ఉపయోగించి ఆన్ లైన్లో డబ్బు సంపాదించడానికి మరొక మార్గం Podcast. కేవలం మన గొంతు ఉపయోగించి కంటెంట్ వినిపించడం. కేవలం మైకు, ల్యాప్ టాప్ ఉంటే చాలు మన Podcast ని స్టార్ట్ చేయవచ్చు. Podcast ద్వారా మనకి Adsense తో పాటు కొద్దిగా ఫ్యామస్ అయితే బయట నుంచి కూడా స్పాన్సర్స్ వస్తాయి.

make money with Content writing or copy writing
కంటెంట్ వ్రైట‌ర్‌గా ఆదాయం సంపాదించ‌డం

మనకి ఏదైనా సబ్జెక్ట్ లో నాలెడ్జ్, రాయడంలో మంచి పట్టు ఉంటే మనం కంటెంట్ రైటింగ్ ద్వారా ఆన్ లైన్లో మనం సులభంగా డబ్బు సంపాదించవచ్చు. మనం ఒక సబ్జెక్ట్ లో ఎక్స్ పర్ట్ అయితే మనకి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
ఈ రోజుల్లో copy writing అంటే ఒక సంస్థకు ప్రకటనలు లేదా ఇతర మార్కెటింగ్ మెటీరియల్స్ కి కంటెంట్ రాయడం. మనం ఎంత బాగా ఆ ప్రోడక్ట్ ను అర్థం చేసుకుని దాని గురించి రాసి సేల్స్ కావడానికి ఉపయోగపడతాయో మనకి అంత డిమాండ్ ఉంటుంది.

Online Consulting

మనం ఒక ఫీల్డ్ లో ఎక్స్ పర్ట్ అయ్యి ఉండి వ్యక్తుల, సంస్థల సమస్యలను పరిష్కరించగలిగే టాలెంట్ ఉంటే మనం ఆన్ లైన్ కన్సల్టంట్ గా మారిపోవచ్చు. కంపెనీ ఎక్కువ జీతాలు ఇచ్చి ఇలాంటి వారిని పర్మినెంట్ గా పెట్టుకునే కెపాసిటీ లేనప్పుడు కన్సల్టెంట్ గా పెట్టుకోవడం వల్ల అవసరమున్నప్పుడే పనిని బట్టి వారికి రెమ్యునేషన్ ఇస్తారు.

Youtube creater

Youtube లో రకారకాల కంటెంట్ తో వీడియోస్ క్రియేట్ చేసి లక్షల కోట్ల ఆదాయాన్ని చాలామంది సంపాదిస్తున్నారు. ఒక వీడియో చెయ్యాలంటే మొబైల్ ఫోన్, మైకు ఉంటే చాలు. ఇందులో కేవలం యాడ్స్ ద్వారా కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఇన్‌కం వస్తుంది. పాడ్‌కాస్ట్ రూపంలో స్క్రీన్‌పై మ‌నం క‌నిపించ‌కుండా కేవ‌లం మాట‌ల ద్వారానే యూట్యూబ్ చాన‌ల్ నిర్వ‌హించ‌వ‌చ్చు.

what is Drop shipping
డ్రాప్ షిప్పింగ్ ద్వారా ఆదాయం

గూగుల్ ట్రేడ్స్ ప్రకారం డ్రాప్ సిప్పింగ్ యొక్క పాపులారిటీ రోజురోజుకీ పెరుగుతుంది. ఒకరు వస్తువును తయారుచేస్తారు. ఇంకొకరు దానిని స్టోర్ చేస్తారు. మరొకరు దానిని ప్యాక్ చేసి పంపిస్తారు. మనం చేయవలిసిన పని ఆ వస్తువు వివరాలను తీసుకుని ఏ అమెజాన్ లోనూ, ప్లిప్ కార్ట్ లో లిస్టింగ్ చెయ్యడం. ఆ వచ్చిన ఆర్డర్స్ లిస్ట్ వాళ్ళకి పంపించడం. వాటిని ప్యాక్ చేసి మన పేరుమీద వాటిని కస్టమర్స్ కి పంపిస్తారు.

earn money from Blog or Website
వెబ్‌సైట్ ద్వారా ఆదాయం

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది బ్లాగ్స్ లేదా వెబ్ సైట్ లు నడిపిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇచ్చే ఆన్ లైన్ బిజినెస్ లో బ్లాగింగ్ ఒకటి. ఒక్కసారి మన బ్లాగ్స్ కి విజిటర్స్ రావడం మొదలైతే మనం చాలా రకాలుగా డబ్బు సంపాదించవచ్చు.
1. మనకి Google Adsense
2. Sponsored Posts బట్టి మనం మంచి ఇన్ కమ్ ను సంపాదించవచ్చు.
3. Affliate Income అంటే అమెజాన్, ప్లిప్ కార్ట్ కి షేర్ చేస్తే దాని ద్వారా వచ్చే ఇన్ కమ్.
4. మన సొంత ప్రొడక్ట్స్.. ఫిజికల్ అయినా, డిజిటల్ అయినా సేల్ చేసుకోవచ్చు.

Graphic Designer

ఈ రోజుల్లో విపరీతంగా డిమాండ్ ఉన్నది గ్రాఫిక్ డిజైనర్ కి. మనకి వెబ్ డిజైనర్ లేదా గ్రాఫిక్స్ లో మంచి స్కిల్స్ ఉంటే మనం ప్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్ గా బాగా సంపాదించవచ్చు. మన క్రియేటివ్ బట్టి రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది.

Translators

మనకి రెండు, మూడు భాషల్లో మంచి పట్టు ఉన్నట్లయితే ఆన్ లైన్లో ట్రాన్సలేటర్స్ గా మంచి డబ్బు సంపాదించవచ్చు. మనం ఒక భాషలో ఉన్న దానిని మన భాషలోకి ట్రాన్సలేట్ చేస్తే అది చదవడానికి, వినడానికి ఆసక్తిగా ఉంటేనే మనం ఆ కంటెంట్ ని తీసుకోగలం.

how to make money from Affiliate Marketing
అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం

మనకి ఒక బ్లాగ్ గాని, వెబ్ సైట్ గాని, యూట్యూబ్ ఛానల్ గాని ఉంటే మనకి మంచి పాసివ్ ఇన్ కమ్ ఇచ్చే సోర్స్ అఫిలియేట్‌ మార్కెటింగ్. మన కంటెంట్ లో భాగంగా వస్తున్న ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని కొనాలి లేదా ఉపయోగించాలంటే మన ఫాలోవర్స్ కి, సబ్ స్క్రైబర్స్ కి అవుతుంది. వాటిని మనం అమెజాన్, ప్లిప్ కార్ట్ లో మన చానల్ తో లాగిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ యొక్క లింక్ షేర్ చేయ్యడం వల్ల అవి అమ్ముడైతే మనకి 1 నుంచి 5 శాతం వరకు కమీషన్ లభిస్తుంది. ఇవి ఎక్కువ‌గా యూట్యూబ్ కంటెంట్ ఇచ్చేవారికి, డిజిటల్ మార్కెటింగ్ ట్రయినింగ్ ఇచ్చేవారికి బాగా ఉపయోగపడతాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *